Wednesday, January 14, 2009

ఋక్కులు

 మహాకవి శ్రీ శ్రీ శత జయంతి 1910 - 2010

కుక్కపిల్లా,
అగ్గిపుల్లా,
సబ్బు బిళ్ళా -
హీనంగా చూడకు దేన్నీ !
కవితా మయమేనోయి అన్నీ !

రొట్టె ముక్కా ,
అరటితొక్కా ,
బల్ల చెక్కా -
నీ వేపే చూస్తూ ఉంటాయ్ !
తమ లోతు కనుక్కోమంటాయ్ !

తలుపు గొళ్ళెం ,
హారతి పళ్ళెం ,
గుర్రపు కళ్ళెం -
కాదేదీ కవితకనర్హం !
నౌను శిల్పమనర్ఘం !

ఉండాలోయ్ కవితవేశం !
కానీవోయ్ రసనిర్దేశం !
దొరకదటోయ్
శోభాలేసం ?

కళ్లంటూ ఉంటే చూసి ,
వాక్కుంటే వ్రాసీ !

ప్రపంచమొక పద్మ వ్యూహం !
కవిత్వమొక తీరని దాహం !

( మహాప్రస్థానం - 1950 )


క్కులు (14-04-1934 )

జయభేరి

మహాకవి శ్రీ శ్రీ శత జయంతి 1910 - 2010

జయభేరి


నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను !

నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను !

నేనుసైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను !

* * *

ఎండాకాలం మండినప్పుడు
గబ్బిలంవలె
క్రాగిపోలేదా ?

వానాకాలం ముసిరిరాగా
నిలువు నిలువున
నీరుకాలేదా ?

శీతకాలం కోతపెట్టగ
కొరడుకట్టీ
ఆకలేసీ కేకలేశానే !
* * *